అరుదైన కళాత్మక మీనాకారి, ధెవా పనితనం కలిపి వేసి అద్భుతమైన సోజో అందాల్ని సృష్టించారు జ్యూవెలరీ డిజైన్స్. సోజో అనేది గ్రీకు పదం పరిపూర్ణత్వం అని అర్ధం, బంగారం తో చేసిన నగలకు రంగుల్ని అద్ది, వజ్రాలు, కెంపులు, పచ్చలు వంటి రత్నాలు జోడించి విక్టోరియన్ శైలిలో అందమైన నగల్ని సృష్టించడం ఈ సోజో నగల ప్రత్యేకత బంగారు రేకుల పైన నీలం, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, రంగుల్ని అద్ది పువ్వులూ, లతలు, పక్షులు, జంతువుల్ని రకరకాలుగా కనిపించేలా చేయడం మీనాకారీకళ. అలాగే 23 క్యారెట్ల బంగారు రేకుపైన సూదిల్లాంటి సన్నని పరికరం తో జంతువులు, పక్షుల బొమ్మలు, కొమ్మలు, రెమ్మలు, చెక్క లక్కతో గాజు పైన అతికించే కళ ధెవా. ఈ ధెవా కళమ్ మీనాకారి జోడించి విక్టోరియన్ తరహ డిజైన్ లతో వచ్చేవి సోజో నగలు. ఈ సోజో నగల్లో నెమళ్ళ డిజైన్లు చాలా ప్రత్యేకం. ఇందులో ఎక్కువగా పెండెంట్ల చెవి దిద్దులే ఎక్కువగా వస్తున్నాయి.

Leave a comment