బంగారంతో పోలిస్తే రోజ్  గోల్డ్ ధర తక్కువే. బాగా జ్యూయలరీ ధరించే అకేషన్ కోసం ఈ రోజ్ గోల్డ్ ఎంచుకోవచ్చు.  బంగారంలో ఎక్కువ శాతం రాగి కలిపితే బంగారం కాస్త గులాబీ వర్ణంలోకి మారుతుంది. ఈ మారేందుకు గాను కొద్దిపాటి వెండి కూడా కలుపుతారు. 18 క్యారెట్స్ బంగారంలో 75శాతం బంగారం, 21శాతం రాగి, నాలుగు శాతం వెండి కలుస్తుంది. వెండిశాతం కాస్త పెంచితే బంగారం గులాబీ రంగులోకి మారిపోతుంది. దీన్ని మిగతా లోహాలతో తయారైన ఇతర నగలతో కలిపేస్తే వాటి మధ్య ప్రత్యేకంగా కనిపించడం ఈ రోజ్ గోల్డ్ నగల ప్రత్యేకత. ఉదాహరణకు రెండు బంగారు గాజుల మధ్య, లేదా చక్కని అల్లికతో ఉన్న వెండి గాజుల మధ్య ఈ రోజ్ గోల్డ్ గాజు కలిసిపోయి కొత్తగా స్టయిల్ గా ఉంటుంది. ఈ రోజ్ గోల్డ్ వెరైటీలు ఆన్ లైన్ లో చూడండి.

Leave a comment