బస్ ఎక్కుతూ లేదా టూ వీలర్ పైన స్పీడ్ గా దూసుకుపోయే అమ్మాయిలకు జారిపోయే చున్నీలు, ఓణీలతోకాస్త కష్టం. ఆ ఇబ్బంది లేకుండా చున్నీ అటాచ్ చేసి డ్రస్ తయారుచేశారు డిజైనర్లు . సాధారణంగా అమ్మాయిలు చిన్నపాటి ఫంక్షన్ లకు సాంప్రదాయక దుస్తులు ఇష్టపడతారు . లెహెంగా ,లంగా ఓణీ వేసుకొంటే జారిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి . అందుకే అనార్కలి కుర్తీలకు చున్నీని కలిపి కుట్టేస్తున్నారు డిజైనర్లు . ఓణీని లెహెంగా కలిపి కుట్టటంతో దానికి పిన్ పెట్టుకొని మెయిన్ టెయిన్ చేసే ఇబ్బంది పోయింది . పలాజో ,ధోతి ప్యాంట్లు ,లాంగ్ గౌన్ లకు కూడా చున్నీని కలిపి కుట్టేయటం లో ఈ ఫ్యాషన్ అమ్మాయిలకు చాలా నచ్చింది .

Leave a comment