పెరుగులో పండిన అరటి పండు కలిపి తింటూ వుంటే ఎన్నో రకాల సమస్యలు ఉండవని ఆయుర్వేదం చెప్పుతుంది. పూర్తి ఫ్యాట్ వున్న పెరుగు లేదా ఏ మాత్రం కొవ్వు లేని పెరుగు లేదా రెగ్యులర్ ఏ పెరుగు అయినా ప్రోబయోటిక్స్ పుష్కలంగా వుంది జీర్ణ శక్తిని మరి కాస్త మెరుగుపరుస్తుంది. అలాగే అరటిపండు లోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలని పరిరక్షిస్తుంది. జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 కాల్షియం, పీచు వంటివి శరీరానికి శక్తిని ఇస్తాయి. రెండు స్పూన్ల తేనె కలిపి మిల్క్ షేక్ చేసుకుని ఉదయాన్నే తాగితే శక్తి వస్తుంది. పెరుగు, పాలు రెంటిలోనూ అరటిపండు మంచిదే.

Leave a comment