ఉల్లి పాయలు కొస్తే కళ్ళ నీళ్లు వస్తాయి ఈ చిన్న చిట్కా తో కళ్ల నీళ్లు రాకుండా చేయచ్చు పొట్టు తీసిన ఉల్లిపాయను పదినిముషాలు నీళ్లలో వేసి పడితే చాలు. తర్వాత కొస్తుంటే అవి మాములు కూర ముక్కల్లాగే ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కోయటం సులభం కాదు. అయినా వాటిని చిన్న ముక్కలుగా చేయాలంటే వాటిని ఓ గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత కత్తిని వేడి నీళ్లలో ముంచుతూ ఈ డ్రై ఫ్రూట్స్ కట్ చేయవచ్చు బాదం పప్పు ఇప్పటికిప్పుడు పొట్టు తీయాలంటే వాటిని మరుగుతున్న నీళ్లలో పడేయాలి. ఆ వేడికి పై తొక్క ఊడిపోతుంది.

Leave a comment