పైధాని చీరె చూడగానే మనసుని కట్టేస్తుంది.వార్ట్ రోబ్ లో ఒక్క పైధాని చీరె బోర్డర్ లేకపోతే కష్టం అనిపిస్తుంది. చీరె బోర్డర్ ,స్క్వేర్ డిజైన్ చిలుకలు,పూలు ,నెమలి డిజైన్లతో ప్రత్యేకత సంతరించుకొంటుంది. చీరెలు చక్కని నిండు రంగులలోనే దొరుకుతాయి., ఎరుపు ,నీలం,పసుపు ,ఆకుపచ్చ గులాబీ వర్ణపు చీరెలు ఎక్కువగా ఉంటాయి. ఈ చీరె నేత ఒక ఆర్ట్స్. నూలు ఆరబెట్టటం దగ్గర నుంచి జరీ నేసే వరకు చీరెల సృష్టి ఒక కళ. పైధాని మోలాలకు చెందిన నేత పని వాళ్ళు చీరెల నేతతో ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. పైధాని మహారాష్ట్రలోని ఒక పట్టణం భారత దేశంలో ఖరీదైన చీరెల తయారీ కేంద్రం.

Leave a comment