మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్ హారర్ సినిమా చూపించారట. సినిమా చూసిన వెంటనే అందులో సన్నివేశాల గురించి ప్రశ్నిస్తే వచ్చిన సమాధానాలు రాసుకుని వాళ్ళని కళ్ళు మూసుకుని ఆ సినిమా గురించి ఆలోచించమంటున్నారట. 71 శాతం మంది కళ్ళు మూసుకుని ఆలోచించి కరెక్ట్ సమాధానాలిచ్చారట. సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే మనం ఇంట్లో మరచిపోయే వస్తువుల గురించి ఆలోచించాలంటే కళ్ళు మూసుకున్న తరువాత చుట్టూ విషయాలు మాయమై మనసు ఆ సంభంధితమైన విషయం పైనే లగ్నం అవుతోందని ఆలా ఎక్కడ ఏది మరిచిపోయామో మెదడు రివైండ్ చేసుకోగలదని చెప్పారు. పోలీసులు కూడా ఇంటరాగేషన్ సమయంలో అనుమానితులను ప్రశ్నించే సమయంలో వాళ్ళని కళ్ళు మూసుకుని ఆలోచించమని చెపుతారట.
Categories
WhatsApp

కళ్ళు మూసుకుని ఆలోచిస్తే గుర్తొస్తాయి

Leave a comment