కలోంజి, నల్ల జీలకర్ర గా పిలిచే ఈ విత్తనాలు మిరియాల రుచితో వుంటాయి.ఈ విత్తనాలు హానికర బ్యాక్టీరియా ,సూక్ష్మ జీవులు నుంచి జీర్ణాశయాన్ని కాపాడతాయి. ఇవి శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్, సోడియం, జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్, ఖనిజ పోషకాలు ఉంటాయి.ఈ విత్తనాల్లో ని థైమోక్వినోస్ బయో యాక్టివ్  కంపోటెంట్ గా పనిచేస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది.తేనె,కలోంజి విత్తనాల పొడి, వెల్లుల్లి కలిపి ఔషధంగా చేస్తారు దీన్ని వాడితే జలుబు,దగ్గు తగ్గుతాయి.

Leave a comment