బయట రోడ్డు పైనే దుమ్ము ధూళి వాయి కాలుష్యం అను కొంటాం కానీ అలాంటి ఎన్నో కాలుష్యాలు ఇళ్ళలో, వర్క్ ప్లేస్ లో వుండి కళ్ళకు, శరీరానికి హాని చేస్తాయి. ఇంట్లో ఆఫీస్ లో గోడకు వేసిన రంగుల నుంచి ఏరోసాల్స్ వెలువడి కళ్ళకు హాని చేస్తాయి. తలకింద వేసుకునే దండ లో డస్ట్ మైట్స్ అనే సూక్ష్మక్రిములుంటాయి. చెట్టు గాలితో పుప్పొడి, కళ్ళకి ప్రాబ్లం తెస్తాయి. ప్యాక్టరీల నుంచి మన వాహనాల నుంచి వెలుపకే పొగ నుంచి వచ్చే లెడ్ కళ్ళను మందిస్తుంది. సుగంధ ద్రవ్యాలు, స్ప్రేలు, కాస్మెటిక్స్ నుంచి వచ్చే వివిధ వాసనలు కుడా కళ్ళు, ముక్కుని మండిస్తాయి ఎక్కువగా వాహనాల్లో తిరగడం ఎయిర్ కండీషన్లు ఎలక్ట్రిక్ ఉపకరణాల నుంచి వచ్చే కాలుష్యాలు గాలి లోకి చేరి కంటికి ముక్కు ద్వారా శరీరం లోను చేరి ఎన్నో ఎలార్జీలకు కారణం అవ్వుతున్నాయి. ఒకవేళ ఏ కాలుష్యం కారణంగా అయినా కళ్ళు దురదగా అనిపించినా మంట పుట్టినా దాన్ని పదే పదే నలపకుండా కంటి డాక్టర్ దగ్గరకు పోవడం మంచిది.

Leave a comment