కమలా  సోహానీ  మాధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 1912 సెప్టెంబర్ 14వ తేదీన జన్మించారు . ఆమె తండ్రి నారాయణ రావు భగవత్ ,తన పినతండ్రి మాధవరావు భగవత్ ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలే . కమల సోహానీ  1936 లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సి డిస్టెన్షన్ లో పూర్తి చేసారు .  ఐఐఎస్సి  లో శ్రీనివాసయ్య మార్గ దర్శకత్వంలో కమలా  సోహానీ  పాలు,పప్పు ధాన్యాలు ,గింజధాన్యాల్లోకి ప్రొటీన్ల పై పరిశోధన చేశారు . ఢిల్లీ లోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజిలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా నియమితురాలయ్యారు .’ నీరా “పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు అమృతం వంటిదని ఆమె నిరూపించారు . ఆమెను రాష్ట్రపతి అవార్డు వరించింది .

Leave a comment