ప్లాస్టిక్ తో పర్యావరణానికి కలుగుతున్న హాని చూసి భరించలేక, ఆ ప్లాస్టిక్ ను ఏరుకొని వచ్చి శుభ్రం చేసి గృహాలంకరణ  వస్తువులు చేయడం ప్రారంభించింది కమలా మహారాణా.ఈమెది ఒడిశా లోని ఖైరాబాద్ ఈ పని కి రాణి ప్లాస్టిక్ తో అందమైన బుట్టలు, పెన్ స్టాండ్ లు మొబైల్ స్టాండ్ లు పూల కూజాలు తయారు చేసేది కమల. ఈమె స్థానిక మార్కెట్ లో వాటిని అమ్మి ఆదాయం పొందడం చూశాక చాలామంది ఆమె దగ్గర ఈ బుట్టల అల్లకం నేర్చుకున్నారు. ఒక 50 మందితో స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్లను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది కమల. ఆమె చేసిన కృషిని ప్రధాని మోదీ మన్ కి బాత్ ప్రోగ్రాం లో పొగడటమే కాక ఆమెను కలిసినప్పుడు ఆమె పాదాలకు నమస్కారం చేశారు ప్రధాని.

Leave a comment