విఘ్నేశ్వరుడు మనకు ఆది దేవుడు.36 రూపాలతో పూజిస్తాం.వీటిలో 16 రూపాలకు చాలా ప్రాముఖ్యం కలదు.అందునా కమండల గణపతి కూడా పూజింపబడుతున్నాడు.కర్నాటక రాష్ట్రంలోని చిక్మంగళూర్కి 10కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో మనకు కమండల గణపతి ప్రసాదం లభిస్తుంది.
పురాణ కథనంలో శని వక్ర దృష్టి వలన పార్వతీదేవికి అనేక సమస్యలనుఎదుర్కోవలసి వచ్చింది కావున ముందగా విఘ్నేశ్వరునికి పూజ చేసి సమస్యలను దూరం చేసుకోవాలి అని ఈ ప్రశాంతమైన ప్రదేశంను తపస్సుకి ఎంచుకుంది.ఇక్కడ తుంగ నదికి ఉపనది బ్రహ్మ  ప్రవహిస్తుంది.పార్వతీదేవికి గణపతి కమండలంతో బ్రహ్మచారిగా ప్రత్యక్షమైనాడు.
పార్వతీ దేవికి తన కమండలో నుండి తీర్థం ఇచ్చి పవిత్రురాలిని చేశాడు.దట్టమైన అడవుల నుండి కొండలలో నుండి వచ్చిన నీటిలో దివ్య ఔషధాలు వుంటాయి అని భక్తులు ముందుగా ఈ కుండనలో స్నానం చేసి కమండల గణపతిని దర్శనం చేసుకుంటారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,కుడుములు.

                  – తోలేటి వెంకట శిరీష

Leave a comment