ఎండలు మాడ్చేస్తుంన్నాయి. సహజంగానే చర్మం కమిలిపోయి వాడిపోయి కనిపిస్తుంది. ఈ నలుపు తగ్గి కాంతి వంతంగా ఉండాలంటే ఇంట్లో అందుబాటులో వుండే పదార్ధాలతో బ్యూటీ ప్యాక్ తాయారు చేసుకోవచ్చు. బాదాం నూనె లో ఇ-విటమిన్ వుంటుంది. ఇది చర్మం ముడతలు పడనీయదు. ఇందుకోసం రోజ్ వాటర్, గ్లిజరిన్, బాదాంనూనె కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ తయారీ కోసం ఎండిన గులాబీ రేకుల్ని గిన్నెలో వేసి మరిగించిన నీళ్ళు అందులో పోసి రాత్రంతా అలా వుంచి ఉదయాన్నే వడకడితే రోజ్ వాటర్ తయ్యారవ్వుతుంది. ఈ రోజ్ వాటర్ లో గ్లిజరిన్ బాదాం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని మునివేళ్ళతో చర్మానికి పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయ్యారవ్వుతుంది. ఇది ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు ఉంచుకోవచ్చు. లేదా ఎప్పటికప్పుడు తాయారు చేసుకున్నా పర్వాలేదు. కానీ ముడతల నివారణకు ఇది మేలైన వైద్యం.

Leave a comment