Categories
ఒకే విధమైన నెక్ ఉండే డ్రెస్ లు వేసుకున్నా లేదా ఏ భుజాల వరకు బ్లౌజ్ తొడుక్కున్న ఎండ తగిలిన శరీర భాగం నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ తో ఆ నలుపు మాయం అవుతోంది బాగా పండిన అరటిపండు టేబుల్ స్పూన్ తేనె అర టీ స్పూన్ జోజోబా ఆయిల్ టేబుల్ స్పూన్ పెరుగు కోడిగుడ్డులోని తెల్ల సొన టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి తీసుకోవాలి.అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని క్రీమ్ లాగా వచ్చేవరకు బ్లెండ్ చేయాలి ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన చర్మానికి పట్టించి పావు గంట తర్వాత మెల్లగా మర్దన చేసి గోరువెచ్చని నీళ్ళతో కడగాలి. ఈ మిశ్రమం చాలా మంచి ఫలితం ఇస్తుంది.