కథానాయకులు ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకతలో కనిపిస్తారు. హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్‌ వీటికి వాళ్ళు ఎంతో కష్టపడి శరీరాన్ని తీరుగా మలుచుకున్నారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. మరి మా సంగతేమిటి. మేం ఎంత శ్రమ పడితే ఎప్పుడూ ఒకేలా కనిపించగలుగుతామో ఎవ్వరు అర్ధం చేసుకోరు అంటుంది రాశీఖన్న. శారీరకంగా ఎలాంటి మార్పు కనిపించకూడదు అనుకున్నం అంటే కసరత్తులు చేయాలి. బరువు కాస్త తగ్గినా, పెరిగినా ఆ ప్రభావం మొహంలో కనిపిస్తుంది. వ్యయామం ఎక్కువైతే నాజుకుతనం మాయం అవుతుంది. మేము చాలా కాష్టాలు పడి అన్ని సినిమాల్లో ఒకేలా కనిపిస్తూ ఉంటాం. ఇవి ఒక్క సినిమా కోసం కాదు నిరంతరం ఇది సాగాల్సిందే అంటుంది రాశీఖన్న. నిజమే కదా ఈ కష్టం కనిపించదు.

Leave a comment