నీహారికా ,

స్నేహానికి కూడా హద్దులుంటాయి అన్నావు. హద్దులంటే స్థలాలకు ళ్ళకు మధ్య ఉండేలాంటివే. కొంతవరకే స్నేహంలో అయినా ముందులేళ్ళగలం. ఎంతవరకు వెళ్ళాలి. ఎలా గుర్తించాలి. అంటే మరి దాన్ని సభ్యతగా ప్రవర్తించటం అనాలి. మనిషి అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక హద్దు గీత కనిపించకుండా ఉంటుంది. అది ఎంత దూరం అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటోంది . కొందరి సరిహద్దు చాలా విశాలంగా ఉండి  ఎదుటివారిని కొంత మనసుకి దగ్గరగా రానిస్తుంది. కానీ మనం గుర్తించవలిసింది ఎదుటి వాళ్ళ వ్యక్తిగత సమయం వ్యక్తిగత అభిప్రాయాలూ ఆలోచనల హద్దులు స్నేహితులు కదా అని పర్సనల్ విషయాల్లోకి దూసుకుపోవటం అడక్కపోయినా అభిప్రాయాలూ చెప్పేయటం ఒక విషయంలో చాలా త్వరగా ఒక నిరణయానికి వచ్చ్చేయటం స్నేహాలను పాడుచేస్తాయి. అందుకే హద్దులు కావాలన్నది. ఎంత స్నేహితులు ఆత్మ బంధువు లైనా సరే ఒక సున్నితమైన రేఖ ఉంటుంది. మనం దాన్ని దాటి ప్రయత్నం చేయకూడదు . అలాగే అన్నీ గబగబా చెప్పేసుకుని మళ్ళీ మన విషయాలు అవతలి వాళ్లకు తెలిసిపోయాయే అన్న న్యూన్యత మన లోనూ రాకూడదు. అందుకని కొంచెంగా మనకు ప్రైవసీ ఉంచుకోవాలి. అందులోకి ఎవర్ని తొంగిచూడనీయ వద్దు. అదే హద్దుల్లో వుండే స్నేహం అంటే. అలావుంటే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం.  !!

 

Leave a comment