Categories
WhatsApp

కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది సుమా.

కంప్యుటర్ తెర ముందు ఎక్కువసేపు గడపడం, స్మార్ట్ ఫోన్ లో తలదూర్చి గంటలు గడపడం వల్ల కళ్ళ ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది అంటున్నారు డాక్టర్లు. అదే వృత్తి పరమైన అంశం అయితే ముందుగా కళ్ళ గురించి ఎలాటి జాగ్రాత్తలు తీసుకోవాలో డాక్టర్ ను అడిగి తలుసుకోవాలి. ఎండలో తప్పనిసరిగా తిరగవలసి వస్తేనే యు.వి కిరణాల నుంచి రక్షణ ఇచ్చే కల్లజూడు ఎంచుకోవాలి. కూలింగ్ గ్లాసెస్ తో కంటి లో తేమను కొద్ది కాలం నిలుపుకోగలరు. కానీ అది శాశ్వతమైన నివారణ మార్గం కాదు. కళ్ళకు మేలు చేసే కంటి నీటి గ్రందులనిచురుకుగా పని చేయించే ఒమేగా నూనె, ఫాటీఆమ్లాలు వున్న చేపలు, ఎండు పండ్లుతప్పనిసరిగా తినాలి కానీ, టెలివిజన్ ముందు పని చేసే ఉద్యోగులు మాత్రం సమస్య రాకముందే డాక్టర్ ను సంప్రదించి సలహా తిసుకోమంటున్నాయి అధ్యాయినాలు.

Leave a comment