కళ్ళు మనసుని ప్రతిబింభిస్తాయంటారు. మన మనసులో ప్రతి ఆలోచనను కళ్ళు కచ్చితంగా అవతలివాళ్ళకు చెప్పేస్తాయి. మొహానికి తేలికైన కళ్ళే అందం. కంటి చూపు కూడా చాలా అవసరం. ఖచ్చితమైన ఆహార నియమాలతో కళ్ళను కాపాడుకోవచ్చు. పసుపు,నారింజ,ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఆహారపదార్ధాల్లో కెరోటి నాయిడ్స్ పుష్కలంగా ఉండి కంటి చూపు మెరుగుపరుస్తాయి. ఈ కెరోటినాయిడ్స్ ని కాలేయం విటమిన్ ఎ గా మారుస్తుంది. కంటి పై పడిన వెలుగు శోషించుకోవడానికి విటమిన్ ఎ కావాలి. అందుకే మెరుగైన కంటి చూపుకే క్యారెట్లు, క్యాబెజీ, మామిడి,పాలు,గుడ్డు తినాలి. అలాగే జింక్ చాలా ముఖ్యం. రెడ్ మీట్, బీన్స్ , బఠానీ ముడి ధాన్యాల్లో ఉండే జింక్ వయసుతో పాటు చూపు మందగించటాన్ని తగ్గిస్తుంది.

Leave a comment