లాండ్ స్కేప్ చిత్రాలు ఫ్రేముల్లో బిగించి హాల్లో తగిలిస్తే ఇల్లంతా ఎటుచూసినా జలపాతాలు, ఉదయించే సూర్యుళ్ళు, విరసె పూవులు, చక్కని ఇల్లు, జాన పదుల నృత్యాలతో ఒక కొత్త అందం . ఆ లాండ్ స్కేప్ లు కాస్తా ఫ్యాషన్ సామ్రాజ్యంలో జొరబడి డ్రెస్ ల పైకి వచ్చేస్తే. ఇంకా వచ్చేస్తే ఏమిటి లాండ్ స్కేప్ ప్రింట్ల ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చేశాయి. అలాగే ల్యాండ్ స్కేప్ ప్రింట్ల అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ కూడా ఇంకో రకం ఫ్యాషన్. బాహుబలి జలపాతల్ని, తమన్నా అందాలని, పల్లెటూరి దృశ్యాలని, చుడీదార్లు, లెగ్గిoగ్గ్స్, టాప్ ల పైకి తెచ్చేశాయి. ఫ్యాషన్ గురూలు, సినిమాల్లోని విజువల్ ఎఫెక్ట్లు దుస్తుల పైన ప్రింట్లవుతున్నాయి. వీటి పైన ఓ లుక్కేస్తే బెటర్.

Leave a comment