కారాగిరి అంకుర సంస్థ ను ప్రారంభించింది పల్లవి మెహదికర్ పట్వారి.బీటెక్ చదివి ఎంబీఏ చేసిన పల్లవి ది చేనేత కుటుంబం టాటా సంస్థ లో ఉద్యోగం లో చేరాక ఎలాగైనా తన కుటుంబం విడిచిపెట్టిన కళాత్మక రంగం లోకి అడుగుపెట్టాలనుకునేది.2017లో కారాగిరి అంకుర్ సంస్థ మొదలు పెట్టి 75 మంది కళాకారులతో నాసిక్ పట్టుచీరెలు నేయిస్తూ మార్కెటింగ్ పైన దృష్టి పెట్టింది.ఈ మూడేళ్లలో 150 యూనిట్లలో 1500 నేత కుటుంబాలు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం 50 వేల చీరలు విక్రయించారు.కారాగిరి ఇప్పుడు 50 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది.కరోనా సమయం లోనూ ఆర్డర్లు ఆగలేదు లక్షన్నర చీరెలు నేస్తున్నారు కారాగిరి సభ్యులు.

Leave a comment