చర్మం కింది కణజాలంలో కొవ్వు పేరుకుపోయి చర్మం మృదుత్వం కోల్పోయి గట్టిగా అయిపోతుంది. సెల్యూలైట్ గా పిలిచే ఈ సమస్య కాలేజీ పిల్లల్లో కూడా కనిసిస్తోంది.ఈ సమస్యని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పోగోట్టుకోవచ్చునంటున్నారు. పండ్లు ,కాయగూరలతో మంచి ఆహారం , మంచి నీళ్ళు , చేపలు, ముడి ధాన్యాలు వాడకం వల్ల ,రన్నింగ్ , స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్లనూ ఈ సమస్య పోతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెను ,ఆహారంలో పాలు తీసుకోవడం వల్ల అది సెల్యూలైట్ ను క్రమంగా కరిగిస్తుందని చెపుతున్నారు.ఉబ్బిన ప్రాంతాలు కొబ్బరి నూనెతో మసాజ్ చేయటం వల్ల కూడా కొవ్వు కణాలు తగ్గి పోతాయి. కొబ్బరి నూనెలో లావెండర్, సిట్రస్ తైలాలు కలిపి అమ్లం చేసినా ప్రయోజనం ఉంటుంది.

Leave a comment