Categories
WhatsApp

క్రమశిక్షణగా చేస్తే ఫలితం తప్పనిసరి.

పుట్టిన పాపాయికి ఏడాది దాటాక ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టచ్చు  అంటున్నారు ఎక్స్ పార్ట్స్. మంచి ఆరోగ్యం కావాలనుకొంటే  కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్ సైజులు చేయాలి. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ పాటిస్తే రెగ్యులర్ గా వ్యాయామం కంటిన్యు చేసే వీలు కల్పించుకోవచ్చు దగ్గరగా వుండే జిమ్ ఎంచుకోవాలి. ప్రతి రోజు ఒకే సమయానికి జిమ్ కు వెళ్ళే లాగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ జిమ్ కు వెళ్ళడం కుదరకపోతే వాకింగ్ కోసం సమయం కేటాయించుకోవాలి. ప్యాటీ, ష్యుగర్, రిఫైండ్ పదార్ధాలు వదిలేయాలి. పానీయాలు కుడా వద్దు. సరైన దుస్తులు, షూ  ఎంపిక చేసుకోవాలి. వీటి వల్ల సరైన మూవ్ మెంట్స్ వుంటాయి వారంలో రెండు రోజులైనా జిమ్లో స్త్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకోవాలి. లిఫ్ట్ వాడటం మానేసి మెట్లెక్కి పోవాలి. ఫోన్ లో మాట్లాడుతూ కుడా అటు ఇటు తిరిగినా శరీరానికి మూవ్మెంట్స్ ఉంటాయి. ఇక రాత్రి వేళ  మంచి నిద్ర పోవాలి. ఇలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే డెలివరీ తర్వాత శరీరం యధా స్ధితికి వచ్చేస్తుంది.

Leave a comment