ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగిస్తారు . ఈ రోజుల్లో వెలిగించే దీపాలకు ప్రత్యేకత ఉంది . విష్షు ఆలయాల్లో గోపురంమీద ,ధ్వజస్థంభం ఎదుట ,తులసికోట దగ్గర ప్రమిదల్లో ,ఉసిరికాయల పైన బియ్యంపిండి తో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి శివాలయాల్లో  ధ్వజస్థంభం పైన నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తయిన ప్రదేశాల్లో కుండలు లోహపాత్రలతో బరిణల్లో దీపాన్ని ఉంచి వేలాడదీస్తారు . అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులు ,నదులు,కోనేర్లు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు . ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు . ఆ దీపాలను వెలిగిస్తే వీటిలోంచి వెలువడే వాయువు వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి శుద్ధిచేస్తుందని ఆరకంగా ఆరోగ్యం బావుంటుందని నమ్ముతారు ఎలా చుసిన ఈ దీపం మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతుందనే భారం .

Leave a comment