అందరికీ “కార్తీక పౌర్ణమి” శుభాకాంక్షలు.
కార్తీక మాసంలో వచ్చే విశిష్టమైన,ప్రత్యేకమైన పర్వదినం.
కార్తీక మాసం మొదలే హరిహరాదుల సేవలు అని అర్థం.ఈ రోజంతా దేవాలయాలన్ని శివనామాలతో మారుమోగుతూ ఉంటుంది.జ్వాలాతోరణం,కార్తీక దీపాలు వెలిగించటం,ముత్తైదువతనానికి ప్రతీకగా ఆవునెయ్యితో 365 ఒత్తులను వెలిగించి  అరటి దొన్నెలో పెట్టి నది తీరానికి వెళ్ళి సాగనంపుతూ ఒకరినొకరు పసుపు కుంకుమలతో వాయనం ఇచ్చి పుచ్చుకుని ఆనందంగా గడుపుతారు.
ఈ రోజు దీప దానం చేసిన ఎంతో మంచిది.రోజంతా ఉపవాస దీక్షతో వుండి సాయంత్రం పూజలు చేసి ముక్తి పొందుతారు. అన్నదానం చేస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment