కల్లోలిత ప్రాంతంగా పేరు పొందిన కాశ్మీర్ లో పోలీస్ ఉద్యోగాల కోసం జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ రిక్రుట్ మెంట్ డ్రైవ్ నిర్వహించింది. పోలీస్ ఉద్యోగం కోసం అభ్యర్దులు  బారులు దీరదు. అందులోను మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగం కోసం రావడం పొలీస్ శాఖనే ఆశ్చర్య పరిచింది. లేహ, కార్గిల్ జిల్లాలో జూలై 20వ తేదీన శారీరక దరుడ్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 1409 మంది అబ్యర్ధులు అర్హత సాధిస్తే అందులో మహిళలే 299 మంది వున్నారు. కాశ్మీర్ లో మహిళా సాధికారిత గణనీయంగా పెరిగిందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఈ డ్రైవ్ లో పాల్గొన్న మహిళా అభ్యర్ధులు పోలీస్ ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు కుడా కుటుంబ సభ్యుల ప్రతి ఘటన ఎదుర్కునే వచ్చారు.

Leave a comment