శ్రమపడితే అందుకు తగ్గ ఫలితం ఎప్పుడూ ఉంటుంది . కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో కానీ రాకుండా మాత్రం ఉండదు అంటోంది సమంత . కొన్ని పాత్రల కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపాను . ఆ ప్రయాణాన్ని సంతోషంగానే చేశాను . నటిగా నాకు ప్రతి పాత్ర ఒక సవాల్ గా ఉండాలి . ఆ నిద్ర గురించి చిత్రీకరణ గురించి కొన్నాళ్ళయినా నేను భయపడాలి అప్పుడే ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తుంది నాకు . పైన నాకు మంచి పాత్రలు వచ్చాయి . ఇవి ఏ నటి చేసినా అంతే పేరు వచ్చేది . ఇలాటి అవకాశాలు రావటం వరకు జరిగే ప్రయాణం ఎంతో ఒత్తిడితో కూడుకొని ఉన్నదైన అందుకు తగ్గ ప్రశంసలు దక్కుతాయి అంటోంది సమంత . జీవితంలో వచ్చే అవకాశాల కోసం ఎదురుచూడటం ,వచ్చాక కస్టపడి సద్వినియోగం చేసుకోవటం ఎవరైనా తప్పనిసరిగా ఓర్పుగా చేయవలసిన పనులే కదా?

Leave a comment