పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల  ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే ప్రేమ కావాలి. పెళ్లిళ్లు పేరంటాలకు పిల్లల్ని తీసుకుపోయినట్లే స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే విషాదాలు కూడా వాళ్ళకి తెలియాలి. పుట్టిన రోజుకి ఫ్రెండ్స్ కిజిఫ్టు ఇమ్మని చెప్పటం కాకుండా ఎవరైనా అనారోగ్యాల తో వుండే దగ్గరుండి తీసుకుపోయి స్నేహితుల బాధను పంచుకునే అలవాటు చేయాలి. మనం దేన్నీ ఇస్తే దాన్నే  అమూల్యమనుకుంటారు.

Leave a comment