ఈ లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్ట్ బాలా ( project Baala ) ద్వారా ఢిల్లీ లోని మురికివాడల ప్రాంతంలో 18 వేలకు పైగా శానిటర్ నాప్ కిన్స్ ఉచితంగా పంపిణి చేశాం అంటోంది సౌమ్యా డబ్రీవాల్‌ ,మహిళల ఆరోగ్యం కోసం శుభ్రత గురించి డిజిటలైజ్డ్‌ వర్క్‌షాప్ లు నిర్వహిస్తున్నం నగరాల్లో పట్టణాల లోనే అన్నివైద్య సేవలు అందుబాటులో లేవు ఇక వ్యక్తిగత శుభ్రత గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో మహిళలు బాలికలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది ఎన్ని ఇబ్బందులున్నా మా ప్రాజెక్ట్ బాలా ను కొనసాగిస్తున్నాం అంటోంది సౌమ్య ఇంగ్లండ్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ లో చదువుకున్నాను. ఉద్యోగం చేస్తు ప్రాజెక్ట్ బాలా మొదలుపెట్టాను. ఆరాధనా రాయ్‌ గుప్తా నాతో పాటు పనిచేస్తున్నారు చాలా ప్యాడ్స్ పూర్తిగా వస్త్రంతో తయారు చేస్తాం వీటిని శుభ్ర పరిచి ఉపయోగ పెట్టుకోవచ్చు. రెండేళ్ళ వరకు ఈ ప్రాడక్ట్ వాడుకోవచ్చు అంటున్నారు సౌమ్య.

Leave a comment