మేజర్ సినిమాకు కాస్ట్యూమర్ గా చేయటం ఒక ప్రత్యేకమైన అనుభవం అంటోంది రేఖ బొగ్గరపు. హీరో పాత్ర కోసం ఏడు ఎనిమిది రకాల యూనిఫామ్ లు తయారు చేశాను. ఎన్డీఏ, ఆర్మీ, ఎన్‌ఎస్‌జీ.. వీటికి వేర్వేరు ర్యాగ్‌లూ, బ్యాడ్జీలూ ఉంటాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఇంకా పోలీసులూ ఉంటారు మొత్తంగా యూనిఫామ్స్ పైన పెద్ద పరిశోధన చేశాను సినిమాకు ఆర్మీ క్లియరెన్స్ కోసం చూపించినప్పుడు యూనిఫామ్ విషయంలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. ఫ్యాషన్ పైన ఇష్టంతో ఈ ఫీల్డ్ కు వచ్చాను. గూడచారి, గాడ్స్ ఆఫ్ ధర్మపురి, వంటి వాటికి పనిచేసేప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి ఫొటోల్ని చూసి డిజైన్ చేసే దాన్ని అంటుంది రేఖ. కెరీర్ కోసం చాలా కష్టమైన ప్రయాణమే చేశాను అంటుంది రేఖ.

Leave a comment