సినిమా రంగంలో సినిమాటోగ్రాఫర్ల సంఖ్యా చాలా తక్కువ పురుషులతో నిండిన ఆ ప్రపంచంలో నిలదొక్కుకున్నారు ఫాజియా ఫాతిమా . “గతం తో పోలిస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు ఈ సినిమాటోగ్రఫీ రంగంలోకి వస్తున్నారు . కాలేజీలో చదువు కొనే రోజుల్లో యు టి వి లో ఇంటర్కోషిప్ చేశాను అప్పట్లో సౌండ్ ఇంజనీర్ గా కానీ ,సినిమాటోగ్రాఫర్ గా గానీ పనిచేయాలను కొనేదాన్ని . న్యూయార్క్ లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు కాస్త అర్ధం అయింది . ఈ ఫీల్డ్ లో ముఖ్యంగా ఈ రంగంలో కాస్త వివక్ష ఉందని మా ప్రొపెసర్ నన్ను ఇంటికెళతావా ?కోర్స్ పూర్తి చేస్తావా ?అని అడిగారు . కానీ నేను ఈ ప్రదేశంలో నిలదొక్కుకున్న . ఎన్నో నిరుత్సహాలు సహించాను అవాంతరాలు ఎదుర్కొన్నాను అంటుంది ఫాజియా ఫాతిమా .

Leave a comment