ఇళ్లలో పెంచుకునే మొక్కలున్న కుండీలలో ఈ వేసవికి చీమలు చేరుతాయి .చల్లదనం కోసం మట్టి అడుగు వరకు వెళతాయి సిట్రిక్ ఆమ్లం ఉన్న నిమ్మకాయను చీమలు ఇష్టపడవు .పండు నిమ్మకాయ తొక్కల పొడి మొక్కల పైన చల్లితే చీమలు రావు. నిమ్మకాయ, నారింజ తొక్కలను నీటిలో వేడి చేసి చల్లారిన తర్వాత ఆ నీటిని మొక్కల పైన చల్లవచ్చు.దాల్చిన చెక్క ,లవంగాలు ,కారం పొడి, కాఫీ గింజల పొడి ఎండపెట్టిన పుదీనా ఆకులు మొక్క మొదలు భాగంలో ఉంచితే చీమలు రావు. అలంకరణ మొక్కలను ఇళ్లల్లోనే పెంచుతూ ఉంటే ఇంట్లోనేలపైన ఆహార పదార్థాలు పడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఆహారాన్ని మూత ఉన్న గిన్నెలలో పెట్టుకోవాలి.

Leave a comment