Categories
చాలా మంది సెల్ ఫోన్లు దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఎంతోకొంత రేడియోషన్ వెలువడుతుంది. ఇది డిఎన్ ఏ ని దెబ్బ తీస్తుందని చర్మ సంబంధ వ్యాధులు తెచ్చి పెడుతుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే మూడు నిమిషాలకంటే తక్కువ సమయంలోనే ముగించాలి. లేకపోతే రేడియోషన్ ప్రాబ్లం తప్పదు. ఇయర్ ఫోన్స్ , బ్లూ టూత్ వంటివి కొంత నయం డెస్క్ టాప్, కంప్యూటర్లు, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్ నిరంతరం ఉపయోగించవలసిన ఉద్యోగాలైతే వాటిని నేరుగా వడిలో పెట్టుకోకుండా టేబుల్ పైన పెట్టుకుని పని చేయాలి. అనారోగ్యాలు తెచ్చుకోవటం కంటే ముందు జగ్రత్తా మంచిది కదా.