మహిళల్లో గుండె పోటు లక్షణాలు స్పష్టంగా కనబడవు .పురుషుల్లో గుండె పోటు వస్తే ఛాతీనొప్పి ,బరువు ,చెమటలు పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. కానీ మహిళల్లో అంత స్పష్టంగా ఏవీ ఉండవు. కడుపు నొప్పి అనో,వికారమో ఏదో అసౌకర్యమో అనిపంచటం ఎన్నో సంధర్భాల్లో అసలు అదేం నొప్పో తెలియకపోవటం,పోత్తి కడుపు పై భాగాంలో నొప్పిగా ఉండటం,వీటి వల్ల స్త్రీలలో గుండెపోటు గుర్తించటడం ఆలస్యం అవుతోంది. అందువల్లేనే గుండె జబ్బు కారణంగా మరణాలు స్త్రీలలో ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.మహిళలు వ్యక్తిగత ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని సూచిస్తోంది.

Leave a comment