ఈ సీజన్లో వచ్చే మామిడిపండ్లు సంవత్సరానికి నిలువ ఉండే ఆవకాయ పచ్చడి ఎవరికైనా ఇష్టమైనమే,షుగర్ బీపీ ఉంటే అసలు తినకూడదు అని అనుకుంటారు కానీ ఒక లిమిటెడ్ లో తీసుకుంటే నష్టం లేదంటున్నారు డాక్టర్లు మామిడి పండు తినాలనుకుంటే మిగతా కూరలు మానేసి పెరుగు మామిడి పండు కాంబినేషన్లో తీసుకోవచ్చు లేదా మామిడి పండుస్నాక్ లాగా తీసుకోవాలి.సాయంత్రం ఐదు గంటలకు 250 గ్రాముల వరకు తీసుకోవచ్చు ఆవకాయలో గ్రేవీ, నూనె ఉంటాయి కనుక సాధ్యమైనంత తక్కువ ఒక స్పూన్ పచ్చడి ఒక్క ముక్క తీసుకుంటే పర్లేదు.అలాగని అదే పనిగా తింటే ప్రమాదమే ఆహారం ప్రణాళిక మార్చుకుంటూ జాగ్రత్తగా తినడం అలవాటు చేసుకుంటే ఏదైనా శరీరానికి నష్టం కలిగించదు.

Leave a comment