నీహారికా,

ఎప్పుడూ విజయపు దారినే నేను నడవాలి, అందుకు నాకు తోడుగా వచ్చేదేమిటి అన్నావు కదా. సోమర్ సెట్ మామ్ ఏమంటాడో చూడు. ‘గొప్ప ఫలితాలు ఆశించే వాళ్ళు, సాధారణమైన వాటిని తిరస్కరించాలి. ఎంతో ఆత్మ విశ్వాసం తో విజయం వైపు ప్రయాణం చేస్తేనే అద్భుతమైన ఫలితాలు ఎదురొస్తాయి’ అని. అలాగే నీ అంతరంగం విశ్వం కంటే విశాలమైంది. ఎంతో శక్తివంతమైంది కూడా. నీ విశ్వాసానికి మూలాలు నీ అంతరంగంలోనే ఉన్నాయంటాడు స్టీవ్ ఫోర్బ్స్. మన ఆలోచన నుంచే అంతరంగం అభివృద్ధి క్రమం వైపు సాగుతుంది. నీహారికా. విజయమైనా, పజయమైనా ఏదయినా సరే స్వీకరించగలిగితే మనం స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించగలిగితేనే విజయపు బాట పైన ధైర్యంగా నడవగలం. ఇందుకు కఠోర శ్రమ చేయాలి. పట్టుదల వుండాలి. చక్కని ప్లానింగ్ తో ముందుకు పోవాలి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చడువైనా ఏదయినా సరే విజయం సాధ్యం ఏమంటావు. ఆత్మ విశ్వాసం ఒక్కటి నీకు తోడుంటే చాలు ఎలాంటి అసాధ్యలైనా సాధ్యమే.

Leave a comment