శివయ్యని పూజించే వారిలో హనుమంతుడు ప్రప్రథముడు. ఈ క్షేత్రంలో శ్రీ రాముడు వనవాసం పూర్తి చేసుకొని హనుమంతుడుకి కాశీ నుండి శివలింగం తీసుకొని రమ్మని పంపిస్తే తన రాక ఆలస్యం అయిందని ఆగ్రహంతో హనుమంతుడు లింగాలను చెల్లాచెదురుగా విసిరేయడం జరిగింది. మరి అలాంటి చిరంజీవి శివుని పూజించాలి కదా!!రాములవారు హనుమంతుని తండ్రి కేసరి నామంతో ఈ ప్రదేశం ప్రసిద్ధి అవుతుంది అని హనుమంతున్ని శాంత పరిచాడు. కీసర గుట్టలో శివయ్య చాలా నిర్మలమైన మనసుతో భక్తులను  రక్షిస్తాడు.
శ్రీ రాముడు ప్రతిష్టితమైనది కావున రామలింగేశ్వరుడిని పూజించిన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భక్తులు చేసే పూజలో లోపాలు ఉన్నా ఈ రామలింగడు ఇట్టే క్షమించేసి కోరిన వరాలు ప్రసాదిస్తారు.
కార్తీక మాసంలో తప్పకుండా కీసర గుట్ట దర్శనం చేసుకోవాలి. అక్కడ వాతావరణంలో ఉన్న స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత మనసుకి
ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతోంది.
ఇష్టమైన రంగుల:నీలం,బూడిద రంగు, తెలుపు.
ఇష్టమైన పూలు: బిల్వపత్రం,మారేడు దళాలు
ఇష్టమైన పూజ:త్రిశూలధారికి త్రికాలాభిషేకాలు.
నిత్య ప్రసాదం: భోళాశంకరుడికి అన్నం పొంగలి చాలా ప్రీతికరం.సోమవారం నాడు నైవేద్యానికి తయారు చేద్దాం రండి.
తయారీ విధానం: స్వచ్ఛమైన పాలు మరిగిన తరువాత బియ్యం కడిగి అందులో వేసి తగినంత బెల్లం వేసి ఉడికించి చివరికి వేయించిన జీడి పప్పు,కిస్మస్,యాలకుపొడితో సరి.
     హర హర  శంకర జయ జయ శంకర అని
  ధ్యానం చేయండి!! అదిగో వచ్చేవాడు చూడండి!!

-తోలేటి వెంకట శిరీష

Leave a comment