ఈ సీజన్ లో ముంజలోస్తాయి. వీటిలో శరీరం చల్లబడటమే కాదు ఎండ నుంచి ఉపశమనం అలాగే సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, ఇనుము, జింక్, ఫాస్పరస్ , పోటాషియం ,కాల్షియం వంటి పోషకాలున్నాయి. నీటిశాతం ఎక్కువ. ఇవి తింటే శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కేలరీలు తక్కువే కాని అవసరమైన శక్తి లభిస్తుంది. తక్షణ శక్తి ఇస్తాయి ముంజలు .గర్భణీలు కూడా వీటిని తినచ్చు. గర్భవతులుగా ఉన్నప్పుడు తలెత్తే జీర్ణాశయం సమస్యలకు ఇవి పరిష్కారం.

Leave a comment