కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమిస్తున్నారు .ఈ నేపథ్యంలో కేరళకు చెందిన నర్స్ లే కీలక పాత్ర పోషిస్తున్నారని అధ్యయనాలు చెపుతున్నాయి .ప్రపంచ ఆరోగ్య  సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్స్ ల్లో భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ .అందులో కేరళదే అగ్రస్థానం .కేరళ లో చదువుకొన్న 30 శాతం మంది నర్స్ లు అమెరికా  బ్రిటన్ లు 15 శాతం మంది ఆస్ట్రేలియా లో , 12 శాతం మంది తూర్పు ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు .బ్రిటిష్ పార్లమెంట్ మాజీ సభ్యురాల అన్నస్ బ్రీ ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో వెల్లడించారు .ప్రతిభా , సేవా నిరతి ఉన్న భారత దేశానికి చెందిన నర్స్ లు ముఖ్యంగా , కేరళ నర్స్ ల నుంచి మేమెంతో నేర్చుకున్నాం .ప్రస్తుతం కేరళ మహమ్మారితో పోరులో వీరే ముందున్నారు అని చెప్పారు .యూ కే లోని అత్యవసర సేవల బృందాల్లోనూ కేరళ నర్స్ లే మొదటి స్థానంలో ఉన్నారు .

Leave a comment