పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా తినేసినా మంచిదే. డై ఆమ్లా క్యాండీలు వున్నాయి. గొంతు మంట జలుబు వుంటే రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. పరగడుపున ఉసిరి రసం పుక్కిలి పడితే నోట్లోనుంచి వచ్చే పండ్ల నుంచి ఉపసమనం. ఆర్రైటిస్ వంటి కీళ్ళనొప్పుల నివారణకు ఉసిరి మంచిదే. బరువు తగ్గడం, జీర్ణ శక్తి పెంచడం ఉసిరి వల్ల సాధ్యం. దీని లో వుండే ఔషద గుణాల వల్ల ఇది సహజ స్థిరమైన కండీషనర్. ఉసిరి నూనె రెగ్యులర్ గా వాడితే జుట్టు తెల్ల బడటం తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన కేశ సంపదను అందిస్తుంది. జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. ఉసిరిని ఆహారంలో తీసుకుంటే చర్మానికి మంచి రంగోస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. బ్లడ్ షుగర్ అదుపులో వుంటుంది.

Leave a comment