సరిగ్గా వాడుకుంటే ప్రచారానికి సినిమాకు మించిన మాధ్యమం లేదు. బహుశా మణికర్ణిక సినిమాతో ఖాదీకి మంచి రోజులు రావచ్చు. క్రిష్ మణికర్ణికలో కంగనా రనౌత్‌ దుస్తులన్ని ఖాదీతో తయారు చేశారు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్‌ నీతాలుల్లా ఈ సినిమా కోసం ఖాదీ వస్త్ర శ్రేణిని ఎంపిక చేసుకున్నారు. కదన భూమిలో విహారం చేసే వీరనారి ఝాన్సీ రాణి కోసం 26 లక్షల ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసి అందమైన దుస్తులు సమకూర్చారు. ఈ సినిమా తర్వాత ఖాదీకి డిమాండ్ రావచ్చు అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్ వీకే సక్సెనా. ఇది నిజమైతే ఈ సినిమా స్వదేశీ ఫ్యాబ్రిక్ కు అత్యున్నత దశ తెచ్చి పెట్టినట్లే.

Leave a comment