టర్కీలో సుల్తాన్ లు ధరించే సాంప్రదాయ మొరాకో డ్రెస్ కు, ఆ సాంప్రదాయ సొగసు చెడకుండా చక్కని సింగిల్ పీస్ డ్రెస్ తయారుచేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఆమె డిజైన్ చేసిన ఖఫ్తాన్ జావర్ డ్రెస్ గా లేదా జావర్ కోట్ గా ధరించవచ్చు జీన్స్ పైకి షర్ట్ లేదా లాంగ్ ఖఫ్తాన్ ధరిస్తే బయటకు వెళ్లేందుకు సరైన ఔట్ ఫిట్ గా భావిస్తున్నారు పెళ్లిళ్లు ఎంగేజ్ మెంట్ కు లెహంగా, చోలీ, పట్టుచీర దరిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఫ్యాషన్ డిజైనర్ మసాబా వధువు మెహందీ ఫంక్షన్ కోసం ఖఫ్తాన్స్ డిజైన్ చేసింది. సింపుల్ అండ్ గ్రేస్ లుక్ తో ఖఫ్తాన్ అందరినీ ఆకర్షిస్తోంది. పెళ్లిళ్లలో పట్టు దుస్తులు ధరిస్తారు కదా కానీ ఆధునిక లుక్ తో ఆకట్టుకోవాలంటే ఖఫ్తాన్ సరైన ఎంపిక పువ్వుల ప్రింటు తో ఉన్న ఖఫ్తాన్ కు ఫ్లవర్ జ్యువెలరీ బావుంటుంది. సాంప్రదాయ రంగు లైన పసుపు, నీలం, బంగారు రంగుల ఖఫ్తాన్ లమీదుకు ముత్యాలు బీడ్స్ చోకర్స్, లోలాకులు అందాన్నిస్తాయి. పుట్టిన రోజులు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కు ఈ సింగిల్ పీస్ డ్రెస్ స్పెషల్ లుక్ ఇస్తుంది. చక్కగా సౌకర్యంగా ఉండే ఈ డ్రెస్ ఏ ఫంక్షన్ ల కైనా,ఏ సందర్భంలో నైనా హాయిగా వేసుకోవచ్చు .

Leave a comment