టీనేజర్స్ బొత్తిగా సోషల్ మీడియాకు అతుక్కుపోయి అన్ని అనుంబంధాలకు దూరం అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్నేహాలు, బంధుత్వాలు అన్నింటికి ఆ వర్చువల్ ప్రపంచం వేదికవుతుందని, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చి పది నిమిషాలైన కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదని నివేదిక చెబుతుంది. వెబ్ ప్రపంచలో బతికే టీనేజర్స్ ను బయటకు తెచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని లేకపోతే వారు భవిష్యత్ లో మానసిక సమస్యలకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ఒక్క ఫాలో లైక్స్ రాకపోతే సాటి వాళ్ళకు వచ్చే కామెంట్స్ లైక్స్ చూసి మానసికంగా ఎంతో బాధ పడతారని ఆ అలవాటు నుంచి వారిని మరల్చలేకపోతే భవిష్యత్ లో అది తీవ్ర రూపం దాల్చి కుటుంబ సంబంధాలు భగ్నం చేస్తుందంటున్నారు.

Leave a comment