మేము న్యూ సిటీ లైట్ ప్రాంతంలో ఉండే వాళ్ళం ఖాళీ ఉన్న ప్రతి చోట అపార్ట్మెంట్స్ వెలిశాయి.పక్షులకు ఆవాసం లేకపోవటం చూశాను.నా చెల్లి పెద్దయ్యాక అసలు ప్రకృతి అంటే ఏమిటో కూడా తెలుసుకోలేకపోతుంది అనిపించింది.అప్పటి నుంచే పర్యావరణం కోసం పనిచేయడం ప్రారంభించాను అంటుంది సూరత్ కు చెందిన 17 ఏళ్ల ఖుషి పర్యావరణం పైన తన ప్రేమను అభిప్రాయాలను తెలియ జేసేందుకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంది ఖుషి ఆమె రాసిన వ్యాసం, అందులో వెలిబుచ్చినా అభిప్రాయాలతో ఖుషి నీ తుంజా ఎకో-జనరేషన్ ప్రాంతీయ రాయబారిగా నియమించింది. ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 2021 వరకు వివిధ అవగాహన  కార్యక్రమాలపై పనిచేస్తుంది. ఇండియాకు గ్రీన్ అంబాసిడర్ గా ఖుషి పర్యావరణం కోసం పని చేయనుంది.

Leave a comment