Categories
వంటింట్లో వాడే స్పూన్ ల దగ్గర నుంచి ప్లేట్స్, గ్లాసులు, గిన్నెలు ఇతర అన్ని రకాల వంట సామాన్లు పైన బంగారు రంగులో అద్దేస్తున్నారు. ఈ గోల్డ్ కలర్ స్టీల్ సామాను చూస్తేనే కళ్ళు చెదిరేలా ఉంటున్నాయి.స్టీల్ ఫిజికల్ వేపర్ డిపాజిషన్ కోటింగ్ పద్ధతిలో బంగారు రంగు అద్దుతారు. ధర కాస్త ఎక్కువైనా అచ్చం బంగారు పాత్ర లాగే ఉన్నాయి.క్యారెట్ తురిమే గ్రేలర్ పిండి జల్లెడతో సహా అన్ని పుత్తడి రంగుతో కళ్ళు మెరుస్తున్నాయి. స్టీలు పాత్రల కుండే మెరుపు పోకుండా బంగారు రంగు అద్దటం తో ఇది తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి .