ఇంటి శుభ్రత కోసం ఎన్నో క్లీనర్లు వాడుతుంటారు కరోనా సమయంలో ఇది మరింత ఎక్కువ అయింది అయితే ఈ వాడకం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం వుందంటున్నారు పరిశోధకులు.పిల్లలు నేలపైన ఎక్కువ సమయం ఆడుకుంటారు క్లీనర్ లతో వాడే రసాయనం పీల్చడం వల్ల ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. నేలపైన పాకడంతో ఆ రసాయనాలు నేరుగా చర్మానికి తాకి అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది 4 వేల మంది పిల్లలపై చేసిన అధ్యయనంలో ఎక్కువగా డిటర్జెంట్లు, స్ప్రే లు  శానిటైజర్ లు, రూమ్ ఫ్రెషనర్లు  వాడే ఇళ్లలో పిల్లలకే ఆస్తమా లక్షణాలు గుర్తించారు. క్లీనర్ల లోని రసాయనాలు వల్లే శ్వాసకోశ నాళాలు దెబ్బతిన్నాయని తేలిందట.కనుక పిల్లలు ఉన్న ఇళ్లల్లో రసాయనాలు వాడే విషయంలో జాగ్రత్తలు తీసుకో మంటున్నారు.

Leave a comment