చాలా మంది పెద్దవాళ్ళు ఇళ్ళలో జారి పడి పోతూ వుంటారు. ఎక్కువ ప్రమాదాలు బాత్ రూమ్స్ లో ,రాత్రి వేళల్లో లేచినపుడో జరుగుతుంటాయి. పెద్దవాళ్ళు ఉంటున్న ఇళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఇంట్లో నడిచే మార్గంలో మెట్లున్న చోట్ల పెద్ద కాంతిలో వుండే లైట్లు ఉండాలి. నిద్రపోయే ముందర,మంచం దగ్గరగా టార్చ్ లైట్ రెడీగా ఉండాలి. మెలుకువ వచ్చినపుడు అలవాటుగా వెళ్ళి పోకుండా లైట్లు వేసుకునే నడవాలి. ఫర్నిచర్ నడకకు అడ్డంగా లేకుండా ఉంచుకోవాలి. పిల్లల ఆట వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వది లేయరాదు . బాత్ రూమ్స్ దాదాపు పొడిగా ఉండాలి బయటవేసే పట్టాలు జారకుండా నేలను అంటి పెట్టుకునేవిగా ఉండాలి. పెద్దవాళ్ళే ఇలాటివి శ్రద్ధగా చూసుకోవాలి.

Leave a comment