బెస్ట్ పోలీస్ క్యాడెట్ గా ప్రధాని మన్ననా అందుకొన్నారు ఐ.పి.ఎస్  అధికారిణి కిరణ్ శృతి. జాతీయ పోలీస్ అకాడమీలు పాసింగ్ అవుట్ పెరేడ్ కు నాయకత్వం వహించి ప్రతిష్టాత్మిక ప్రధాని బ్యాటిన్ అందుకొన్న ఐ పి.ఎస్ అధికారిని. తమిళనాడు లోని నగర్ కోయిల్ కు చెందిన కిరణ్ కుటుంబం చెంగల్ పట్టు లో స్థిరపడ్డారు. చెన్నయ్ లోని టాగూర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సి ఈ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ప్రొబేషనర్ ఆఫీసర్ గా చేరింది శృతి. సివిల్స్ రాసి హైద్రాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకొంది. 131 మంది ఉన్న ఆ బ్యాచ్ లో బెస్ట్ క్యాడెట్ గా నిలబడింది కిరణ్ శృతి.

Leave a comment