గంటల తరబడి పని ఒత్తిడి ఇంట్లోంచి కదలలేని పరిస్థితులు  కలిగే ఒత్తిడి తో కడుపులో అసౌకర్యం ఏర్పడుతోంది.తిన్నారా అరగకుండా కుండా పోతోంది.అలాంటప్పుడు రెండు కప్పుల నీళ్ళలో ఓ స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.అలా వాము మరిగించిన నీళ్లు తాగిన కడుపు ఉబ్బరం పోతుంది. పుదీనా లోని ఔషధ గుణాలు కూడా ఉదర సంబంధమైన సమస్యలు తగ్గిస్తాయి. పుదీనా టీ తాగిన సమస్య తగ్గుతుంది. రోజుకు ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే కడుపు లోని ఇబ్బందులు మాయం అవుతాయి. రోజు రెండు లవంగాలు భోజనం తర్వాత నమిలే అలవాటు చేసుకున్నా ఉదర సంబంధమైన ఇబ్బందులు రావు.

Leave a comment