కిచెన్ లో స్మార్ట్ గా పనిపూర్తి చేయాలంటే కొంత నైపుణ్యం ఉంది తీరాలి. వంట గదిలో వస్తువులు ఎలా వాడాలో తెలియాలి. ఆ వస్తువులతో వంట ఎంత రుచిగా శుభ్రంగా చేయాలో తెలిసి వుండాలి. సాధారణంగా ఫ్రిజ్ లో వుంచిన చేపలు, మాంసం వండే ముందరే బయట పెడితే వాటిని ఉడికించడం మొదలు పెట్టాక పైన తొందరగా ఉడికిపోయి లోపల చల్లని భాగం సరిగా ఉడకదు. అందుకే వాటిని ముందే తీసి రూమ్ టెంపరేచర్ కు వచ్చే వరకు వుంచి ఆ తరువాత ఉడకనివ్వడం, ఫ్రై చేయడం మొదలు పెట్టాలి. అలాగే ఫ్రై చేసే సమయం లో ప్యాన్ లో ఒకేసారి ఎక్కువముక్కలు వేయకుండా కొద్ది కొద్దిగా వేయిస్తూ రావాలి. ఒక ముక్కకు ఒక ముక్క తగలకుండా చూసుకోవాలి. అలాగే వంట పూర్తయ్యాక కౌంటర్ టాప్ ను క్లీన్ చేయటం ప్రధానమైన చర్య. ఎంత అలసిపోయినా ఈ విషయం లో నిర్లక్ష్యం వద్దు. వంటింటి అరుగు వలికిన నూనెతో, పదార్ధాలతో రాత్రంతా వుంటే ఎన్నో సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే. ఎంత రాత్రయినా కౌంటర్ టాప్ ను శుభ్రం చేసేయాలి. బాక్టీరియా చేరకుండా వుంటుంది.

Leave a comment