Categories
వంట ఇంట్లో పనికొచ్చే కొన్ని చిట్కాలు పనిని చాలా సులభతరం చేస్తాయి. పనీర్ నిల్వ వుండాలంటే ముక్కలుగా కట్ చేసి బ్లోటింగ్ పేపర్ లో పెట్టి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. అప్పుడే తాజాగా వుంటుంది. అప్పడాలు పొయ్యి పైన లేదా ఒవెన్ లో వాడచ్చు. పాలితిన్ కవర్ లో పెట్టి వేడిగా ఉన్న అన్నం గిన్నె పైన పెడితే తినేవరకు కారకరలాడుతాయి. మొక్క జొన్న గింజలు పాప్ కార్న్ చేసే ముందు కాసేపు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత వేయిస్తే మరింత కారకరలాడుతాయి, బంగళా దుంప ఉడికించే ముందు ఉప్పు నీళ్ళలో పావు గంట ముందుగా పడేసి వాటిని ఉడికిస్తే త్వరగా ఉడుకుతాయి పై తొక్క తేలికగా వస్తుంది. ఉల్లి పాయల పై పొట్టు వలిచి పేపర్ లో చుట్టూ వెలుతురు రాని చోట పెడితే ఎక్కువ కాలం తాజాగ వుంటాయి.